
కూటమి మోసాన్ని వివరిద్దాం
ఏడాది పాలనలో కూటమి నాయకులను నమ్మి ఓట్లేసిన ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, మోసాన్ని వివరిద్దాం. జిల్లాకు చెందిన మంత్రి ఇచ్చిన పింఛన్ల అమలుకు మూడునెలలైనా దిక్కులేకుండా పోయింది. నియోజకవర్గ, మండల స్థాయిల్లో సమావేశాలు అనంతరం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవ్వాలి. తద్వారా పార్టీని పునఃనిర్మించుకుందాం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడించేందుకు ఈ కార్యక్రమంతో నాంది పలుకుదాం. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. రానున్న రోజుల్లో పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యమిస్తాం.
– మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం