
చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
విజయనగరం క్రైమ్/రామభద్రపురం: జిల్లాలోని రామభద్రపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు చోరీ కేసుల్లో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ముద్దాయి జోకాడ భగవాన్(22)కు ఐదేళ్ల 10 నెలల జైలుశిక్ష, రూ.8 వేలు జరిమానా విఽధిస్తూ సాలూరు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే.. 2023లో రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలో వి.కాంతమ్మ ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలోను.. 2024లో ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్‌లోను జోకాడ భగవాన్ చొరబడి రూ.లక్షా 60వేల నగదు, తులం చెవిదిద్దులు, ఒక ల్యాప్‌టాప్ దొంగిలించాడు. అప్పట్లో బాధితులు ఇచ్చిన సమాచారంపై రామభద్రపురం పోలీసులు రెండు చోరీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారణ చేపట్టిన జడ్జి నేరం రుజువుకావడంతో గురువారం పైవిధంగా జైలుశిక్ష, జరిమానా విధించారు. కాగా జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు మాసాలు సాధారణ జైలుశిక్షను అనుభవించాలని సాలూరు జైఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ తీర్పులో పేర్కొన్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. ఈ కేసులో వాదనలు వినిపించిన వీహెచ్‌కే శర్మ, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు, రామభద్రపురం ఎస్సై ప్రసాద్‌లు సకాలంలో కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు.