
3న వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం వచ్చేనెల 3న నిర్వహించనున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబుతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశానికి కార్పొరేషన్/ మున్సిపల్ చైర్మన్‌లు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర/జిల్లా/నియోజకవర్గ/మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాలోగల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని విజయవంతం చేయాలని కోరారు.
జెడ్పీచైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి
శ్రీనివాసరావు