
పుస్తక హుండీకి విశేష స్పందన
విజయనగరం టౌన్: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తక హుండీ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంఘం వ్యవస్ధాపకుడు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షుడు కె.దయానంద్‌లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో ఉన్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమను సంప్రదించగా ఆయన ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామ న్నారు. పుస్తక హుండీ నిరంతర ప్రక్రియ అని, ఇలా సేకరించిన పుస్తకాలను వివిధ గ్రంథాలయాలు, విద్యార్థులకు అందజేస్త్నునామన్నారు. సెల్ ప్రభావంతో అన్ని వయసుల వారు పుస్తక పఠనానికి దూరమవుతున్న నేపథ్యంలో మళ్లీ పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించి గ్రంథాలయాలవైపు నడిపించేలా సంఘం నిరంతరం కృషిచేస్తుందని చెప్పారు.