
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
సాలూరు: పాచిపెంట మండలం తంగ్లాం గ్రామంలో గిరిజనుడు పోయి అప్పలస్వామి హత్యకేసులో నిందితుడు పోయి రాజును అరెస్ట్‌చేసినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పలస్వామి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారన్నారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా పోయి అప్పలస్వామిని హత్యచేసినట్లు నిందితుడు పోయి రాజు స్వయంగా వీఆర్‌ఓ వద్ద లొంగిపోయాడని తెలిపారు. భూ వివాదంతోపాటు చిల్లంగి అనుమానంతో అప్పలస్వామిని రాజు హత్యచేసినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు.