
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
● రహ‘దారి’ కష్టాలు
8లోu
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. కొండారెడ్డిపల్లి, గుండ్లకుంట, పాత కొడంగల్, పాత కొడంగల్ తండా, బూల్కాపూర్, ఐనన్‌పల్లి గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. మున్సిపాలిటీలో విలీనమైన నాటి నుంచి పూర్తి స్థాయిలో రోడ్ల పనులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. ఐనన్‌పల్లి, బూల్కాపూర్, కొండారెడ్డిపల్లి గ్రామాలకు రోడ్డు వేయాల్సి ఉంది. ప్రస్తుతం మట్టి రోడ్లే ఉన్నాయి. పాత కొడంగల్ వెళ్ల్లాంటే చెరువు కట్టపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కొత్తగా రోడ్లు వేయడానికి నిధులు మంజూరు చేశారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. బూల్కాపూర్, ఐనన్‌పల్లి గ్రామాల్లో సుమారు రెండు వేలకు పైగా జనాభా ఉంది. 1,200మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాలకు వెళ్లాలంటే మట్టి రోడ్లే దిక్కు. ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఐనన్‌పల్లి గ్రామంలో మురుగు కాల్వలు నిర్మించాల్సి ఉంది.
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025