అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

Jul 4 2025 6:49 AM | Updated on Jul 4 2025 6:49 AM

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

అనంతగిరి: సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి.. సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్నారని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని ఆయన నివాసంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశానికి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలపై ఖర్గే దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖర్గే సమావేశం చరిత్రలో నిలిచిపోనుందన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, డీసీసీబీ డైరక్టర్‌ కిషన్‌నాయక్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌చైర్మన్‌ రమేష్‌కుమార్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, బ్లాక్‌ అధ్యక్షులు అనంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి, సీనియర్‌ నాయకులు నరోత్తంరెడ్డి, రాంచంద్రారెడ్డి, వాహిద్‌మియా, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

పాలన నచ్చే పార్టీలోకి చేరికలు

మోమిన్‌పేట: కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన నచ్చే పలువురు పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. గురువారం వికారాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న రకం వడ్లకు బోనస్‌, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ, యువ వికాసం తదితర పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సుభాష్‌గౌడ్‌, ఎరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం

ఖర్గే సమావేశాన్ని విజయవంతం చేద్దాం

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement