
● తాగునీటికి తంటాలు
పరిగి: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు సరిపడా సరఫరా కాకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. మున్సిపల్ పరిధిలో 30వేలకు పైగా జనాభా ఉంది. వీరికి రోజుకు 4.5 ఎంఎల్‌టీ నీరు అవసరం. కానీ 3.5ఎంఎల్‌టీ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. 15 ట్యాంకులు, 76 బోరు మోటార్లు అందుబాటులో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పైప్‌లైన్ ఉంది. ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింది పరిగి మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో నాలుగు ట్యాంకులు, 10 కిలో మీటర్ల మేర పైన్‌లైన్ వేయాల్సి ఉండగా.. పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించడం లేదు.