
పోరాటాలతోనే లంబాడాలకు న్యాయం
పరిగి: హక్కుల సాధన కోసం ఎల్‌హెచ్‌పీఎస్ పో రాటం చేయడం ద్వారానే లంబాడాలకు న్యా యం జరిగిందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గో వింద్‌నాయక్ తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలో ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడా హక్కుల పోరాట సమితి కృషితోనే తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయన్నారు. మా తండాల్లో.. మా రాజ్యం కావాలని వీరన్న నాయకత్వంలో ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. 10శాతం రిజర్వేషన్లు కూడా సాధించుకున్నామని పేర్కొన్నారు. లంబాడాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచామని చెప్పారు. లంబాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చని హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్య నాయక్, కార్యదర్శి రవీందర్, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, సత్తయ్య పాల్గొన్నారు.
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్