
ఆలయ అభివృద్ధికి కృషి
తాండూరు రూరల్: మండలంలోని కొత్లాపూర్‌లో వెలసిన రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ.కోటి మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. మూడు రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న మృత్యుంజయ హోమం మంగళవారంతో ముగిసింది. కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ లింబావళితో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. త్వరలో కల్యాణ మండపం, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నవీన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, నాయకులు సాయిలు, గోపాల్, రాందాస్, పండరి, రాంచెంద్రారెడ్డి, వడ్డె శ్రీను, ప్రదీప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, డైరక్టర్లు రాజు, లాల్యనాయక్, లాలయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
ముగిసిన మృత్యుంజయ హోమం