
పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా నరేశ్
దోమ: పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్‌గా దోమ గ్రామానికి చెందిన కావలి నరేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 29న మండల కేంద్రంలోని పాలఉత్పత్తిదారుల కేంద్రంలో రెండు డైరెక్టర్ స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బొంపల్లి తండాకు చెందిన బుగ్యానాయక్, దోమకు చెందిన జాకరం నారాయణ విజయం సాధించారు. దీంతో మొత్తం 10 డైరెక్టర్ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏడింటిని కై వసం చేసుకుంది. దీంతో కావలి నరేశ్‌ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేశ్‌ను డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య, డైరెక్టర్లు మల్లేశ్, సత్తమ్మ, లలిత, చందర్, నాయకులు మాలి శివకుమార్‌రెడ్డి మల్లేశ్, జావీద్, యాదయ్య, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.