
బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
పూడురు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని రెగడి మామిడిపల్లి, బార్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మైపాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం బార్లపల్లిలోని హనుమాన్ ఆలయానికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజహారుద్దీన్, నాయకులు అదీముద్దీన్, రైస్‌ఖాన్, రాజేందర్ రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.