
● అక్రమ అరెస్ట్‌పై ఆగ్రహం
8లో..
చెవిరెడ్డి అరెస్ట్‌కు నిరసనగా బుధవారం భాకరాపేటలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి
ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేర్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.