
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
తిరుపతి క్రైమ్: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీటీడీ విజిలెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన సతీమణి అమ్ములుకు రూ.5 లక్షల డీడీని ఎస్పీ అందజేశారు.
విరమణ పొందిన హోంగార్డుకు సత్కారం
జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకటరమణ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు వేతనం రావలసిన రూ.5 లక్షలు అందజేశారు.