మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

Jul 2 2025 5:02 AM | Updated on Jul 2 2025 5:18 AM

● తొలుత కిలోకు రూ.12, ఆపై రూ.6 ప్రకటించిన వైనం ● క్షేత్ర స్థాయిలో కిలో రూ.3 కూడా దక్కక రైతుల ఆవేదన ● అయినా సరే కాయ కొనడానికి ముందుకురాని ఫ్యాక్టరీలు ● అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పంట అమ్మడానికి అగచాట్లు ● నిద్రాహారాల్లేక ఫ్యాక్టరీల ఎదుట ఎదురుచూపులు ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దయనీయ పరిస్థి

ఇంటికి పోయే పరిస్థితి లేదు

కాణిపాకం నుంచి గుడిపాల సరిహద్దులో ఉన్న ఫ్యాక్టరీకి కాయలు తెస్తే రూ.5వేలు బాడుగ. ఒక్కరోజు అయినా..రెండు రోజులు..మూడు రోజులు అయినా ఇదే రేటు. ఇక్కడకు కాయలు తెస్తే.. అన్‌లోడింగ్‌ అయ్యేందుకు ఐదు రోజులు పడుతోంది. అంతవరకు ఓపికతో ఉండాల్సిందే. ఇంటికి పోను.. రాను అంటే కుదరదు.

– రవి, బొమ్మసముద్రం, ఐరాల మండలం

టోకెన్లు అమ్ముకుంటున్నారు

వారం పది రోజులుగా తిండీనీళ్లు లేకుండా రోడ్లపై అవస్థలు పడుతున్నాం. రాత్రి సమయాల్లో అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మకై ్క దొడ్డి దారిన టోకెన్లు అమ్ముకుని డైరెక్టుగా 10, 20 వాహనాలు లోపలకు పంపించేస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దోమల బెడదతో నిద్రాహారాలు లేకుండా మేము అవస్థలు పడుతుంటే కొందరు మాత్రం దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు.

– బాబునాయుడు, జీడీనెల్లూరు

కన్న బిడ్డల్లా సాకినాం

సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడు కున్నాం. కన్నబిడ్డల్లా గా పండించాం. ఇప్పు డు మామిడి పంట మొత్తం కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉంది. నాలుగైదు రోజుల నిరీక్షణలతో టార్ఫాలిన్‌పట్ట వేడికి లోలోపలే కుళ్లిపోయి, జ్యూసులా రోడ్లపై కారిపోతోంది. అధికారులు ఫ్యాక్టరీలు ప్రత్యేక చొరవ చూపించాలి.

– శ్రీనివాసరెడ్డి, పెనుమూరు మండలం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడినిచ్చింది. ఇందులో తోతాపురి రకం నుంచి గుజ్జు (పల్ఫ్‌)ను తయారుచేసి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఫలితంగా ప్రతీ ఏటా దాదాపు 40 వేల హెక్టార్లలో తోతాపురి మామిడి రకాన్ని రైతాంగం సాగుచేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్‌ మొదలయ్యింది. కానీ మామిడిని కొనడానికి ఏ ఒక్క ఫ్యాక్టరీ ముందుకు రావడం లేదు. ఒకవేళ కొన్నా కిలోకు సగటున రూ.4 –5 చెల్లిస్తున్నారు. ర్యాంపుల వద్ద కిలో రూ.3 మాత్రమే పలుకుతోంది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర లభించక అన్నదాతకు గుండెకోత మిగులుతోంది.

చేజేతులా కోల్పోతూ..

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఫ్యాక్టరీలు మామిడిని కొనకపోవడంతో రైతు కంట కన్నీళ్లు ఆగడం లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ఫ్యాక్టరీల బయట రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం కిలోకు రూ.6 చెల్లించాలని కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకునే దిక్కులేదు. ముందుగా ఫ్యాక్టరీ వద్దకు రైతు వచ్చి టోకెన్‌ తీసుకోవాలి. ఆ టోకెన్‌ నెంబర్‌ వస్తే తప్ప మామిడిని లోపలకు తీసుకెళ్లడానికి వీల్లేదు. రెండు రోజులు అలాగే ఉంచేస్తే 40 శాతం పంట పనికిరాదు. చిన్నపాటి వర్షం పడితే వంద శాతం పంట రోడ్డుపై పడేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్ల కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, తోపులాటలు, పోలీసులు–ఫ్యాక్టరీ నిర్వాహకులతో వాగ్వాదాలు.. ఇవన్నీ ఓ మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ఉంటే ఇప్పటి వరకు 30 వరకు ఫ్యాక్టరీలు మాత్రమే తెరుచుకున్నాయి. 80 శాతం వరకు ఫ్యాక్టరీలు, కూటమి ప్రభుత్వ అనుకూలురు చేతుల్లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో గరిష్టంగా కిలో మామిడి రూ.23కు అమ్ముడం కొసమెరుపు.

‘మద్దతు’లేక..అగచాట్లు పడలేక

చిత్తూరు జిల్లాలో మామిడి సీజన్‌ మరో పది రోజుల్లో ముగియనుంది. మామిడి పంటను ఫ్యాక్టరీలకు అమ్ముదామని పంటను తీసుకొచ్చిన రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కిలో మామిడికి రూ.12 గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఫ్యాక్టరీలు చెప్పడంతో, కిలోకు రూ.8 ఫ్యాక్టరీలు చెల్లించాలని, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందని.. ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్నెన్నాయుడు ప్రకటించారు. కానీ ఫ్యాక్టరీలు కూడా ఈ ధరలు పాటించలేదు. కిలోకు రూ.4 మించి ఇవ్వలేమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.3 సైతం చెల్లిస్తున్నారు. ప్రభుత్వ హామీలన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయాయి. సీజన్‌ ముగుస్తున్నా ఇప్పటి వరకు రైతుకు మద్దతు ధర అంద లేదు.

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
1
1/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
2
2/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
3
3/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
4
4/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
5
5/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం 
6
6/6

మద్దతుధర కల్పించడంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement