
అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి చర్యలు
రాపూరు : అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేట్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్‌కుమార్ నాయక్ వివరించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రాపూరు వెలుగొండ అడవుల్లోన్ని కూటలమర్ని పోయే ప్రాంతాన్ని జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి ఆదివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవుల్లో నిత్యం అటవీశాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. మూడు జిల్లా సరిహద్దు ప్రాంతంలో సహజ సిద్ధంగా ఎర్రచందనం ఉందని వాటిని రక్షించాలని సూచించారు.అలాగే పెనుశిల అభయార్యణంలో అనేక రకాలైన వన్యప్రాణులు జీవిస్తున్నాయన్నారు. వన్యప్రాణులకు రక్షణ కల్పించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఎర్ర చందనం అంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉందని దానిని కాపాడుకోవాల్సి బాధ్యత ఉందన్నారు. అటవీ సిబ్బంది పరస్పర సహకారంతో అడవుల్లో తిరగాలన్నారు. అడవి లోపలకు వెళ్లకపోతే విషయాలు తెలియవని అధికారులు తిరుగుతుంటే బయట వ్యక్తులు అడవిలోకి రాలేరన్నారు. ఆయన వెంట నెల్లూరు డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, రేంజర్ రవీంద్రబాబు , నెల్లూరు, అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారులు ఉన్నారు.