
● అగ్నిగుండం .. పాపహరణం
అగ్నిగుండం మహోత్సవానికి తరలివచ్చిన భక్తజనం
కణకణ మండుతున్న నిప్పు కణికలు , భక్తి పారవశ్యంతో ఆదివారం కంకణదారులైన భక్తులు నిప్పుల గుండం తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో చివరిగా అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి సింహ వాహనంపై అధిష్టించారు. అగ్ని గుండంలో నిప్పులను తీసుకుని మల్లెపూలలో పెట్టి అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆలయ అనువంశిక పూజారులు అగ్నిగుండ ప్రవేశం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో నిప్పుల గుండం తొక్కారు. పోలీసులు, ఆలయ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. – శ్రీకాళహస్తి
అగ్నిగుండం ప్రవేశం చేస్తున్న భక్తులు

● అగ్నిగుండం .. పాపహరణం