
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రాపూరు:యోగాతో సంపూ ర్ణ ఆరోగ్యం పొందవచ్చని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూ రు ఇన్‌చార్జి కలెక్టర్ కార్తీక్ తెలిపారు. సోమవారం రాపూరు మండలం పెంచలకోనలో నిర్వహించిన యోగాంధ్రలో ఆయన పాల్గొన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా చేపట్టే యోగా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ్ల పర్యటకశాఖ అధికారి ఉషశ్రీ, నోడల్ అధికారి యతియాజ్, డ్వామా పీడీ గంగా భవానీ, డీసీఓ గుర్రప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకటరమణ, ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ లక్ష్మీనరసింహ పాల్గొన్నారు.
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
తిరుపతి క్రైమ్ : అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. తిరుపతిలోని సత్యనారాయణపురం రాజు నగర్‌కు చెందిన సురేష్ (47) ఫారెస్ట్ వర్కర్‌గా పని చేస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగేశాడు. కుటుంబీకులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు కుమారుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.