
ఫుట్‌బాల్ విజేతలకు ట్రోఫీలు
నాయుడుపేటటౌన్: పట్టణంలోని ఏఎల్‌సీఎం గ్రౌండ్‌లో అండర్ 17, 14 విభాగాలలో ఆదివారం నిర్వహించిన ఫుట్‌బాట్ టోర్నీ ఫైనల్స్‌లో తిరుపతి, నాయుడుపేట జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–17 విభాగంలో విన్నర్‌గా తిరుపతి జట్టు, రన్నర్స్‌గా రేణిగుంట, అండర్–14 విభాగంలో విన్నర్‌గా నాయుడుపేట, రన్నర్స్‌గా తిరుపతి జట్లు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. అర్బన్ సీఐ బాబీ చేతులమీదుగా ట్రోఫీలు బహూకరించారు. సీఐ మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న గౌస్‌బాషా నాని, వినోద్ కుమార్, రమేష్‌ను అభినందించారు. కార్యక్రమంలో రెడ్డెప్ప, మైనుద్దీన్, బీజే ప్రసాద్, కళాచంద్, ఆనంద్, భావిన్ అనుదీప్, టైసన్, రాఖీ, ఏలిష, సిరాజ్, భాను విజయ్ పాల్గొన్నారు.

ఫుట్‌బాల్ విజేతలకు ట్రోఫీలు