
స్నేహితుడి పాడె మోసి వీడ్కోలు
తిరుపతి మంగళం:వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డికి సన్నిహితుడిగా పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించిన సోడిశెట్టి నరేష్ రాయల్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నరేష్ భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, అభినయ్‌రెడ్డి నివాళులర్పించారు.మిత్రుడి నరేష్ మరణాన్ని జీర్ణించుకోలేని అభినయ్ భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా స్నేహితు డి పాడె మోశారు. దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు.
రేషన్ బియ్యం స్వాధీనం
నాయుడుపేట టౌన్ : పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బాబి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు గాంధీ పార్కు సమీపంలో దాడి చేసినట్టు తెలిపారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. 50 బస్తాల బియ్యం(1950 కేజీలు), దోస్తు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహన డ్రైవర్ గౌడమాల విజయ్‌కుమార్, యాజమాని కాసి నాగరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.