
ముక్కంటి సేవలో రక్షణశాఖ మంత్రి సలహాదారుడు
శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని శనివారం భారత రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బాపిరెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రస్థాయి డ్రాయింగ్
పోటీలకు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : బయోలాజికల్ డైవర్సిటీ–2025 అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలకు జిల్లాలోని పలు జెడ్పీ హైస్కూల్, ఎస్పీడబ్య్లూ డీఫార్మసీ విద్యార్థినులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ , పెయింటింగ్ పోటీలకు ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని కె.తేజస్విని ఎంపికయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.పద్మావతమ్మ, బయోడైవర్సిటీ బోర్డు రాష్ట్ర సమన్వయకర్త నీలకంఠయ్య అభినందించారు.
విష్ణు నివాసంలో స్కానర్
తిరుపతి క్రైమ్ : విష్ణు వివాసంలో దొంగలను అరికట్టేందుకు ఈస్ట్ సీఐ శ్రీనివాసులు శనివా రం ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. విష్ణు నివాసం కొచ్చే భక్తులను మోసగించే దొంగలను గుర్తించేందుకు ఇది ఎంతగానో దోహపడుతుందన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారిని పిలిపించి ఫింగర్ ప్రింట్ సేకరించడం ద్వారా వారికి నేర చరిత్ర ఉంటే బయట పడుతుందన్నారు.

ముక్కంటి సేవలో రక్షణశాఖ మంత్రి సలహాదారుడు

ముక్కంటి సేవలో రక్షణశాఖ మంత్రి సలహాదారుడు