
మార్కెట్‌లోకి ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కారు
తిరుపతి కల్చరల్: కెశ్విన్ ఆటో మోటార్స్ షోరూం వారి ఆధ్వర్యంలో గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజీ కంపెనీ వారి సరికొత్త విండ్సర్ ఎలక్ట్రికల్ ప్రో కారును మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎంజీ సౌత్ ఇండియా జోనల్ సేల్స్ మేనేజర్ సౌరవ్ ప్రకాష్, ఏఎస్‌ఎం అన్ని విల్సన్, కెశ్విన్ ఆటో మోటార్స్ అధినేత ఉదయ్‌కుమార్‌రెడ్డి ఎంజీ విండర్ ఈవీ ప్రో కారు ఆవిష్కరించి మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ విండర్ ఈవీ వాహనం 52.9 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ సౌలభ్యం కలిగి ఒకసారి చార్జింగ్ చేస్తే 449 కిలోమీటర్లు ప్రయాణం చేసే సౌకర్యం ఉందన్నారు. రాయలసీమలోని తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో తమ షోరూముల్లో విండ్సర్ ఈవీ ప్రో కారు లభింస్తుదన్నారు.
యువకుడిపై కత్తితో దాడి
తిరుపతి క్రైమ్ : జాతర రోజు అర్ధరాత్రి ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు పాత కక్షలతో దాడి చేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలో నివాసం ఉంటున్న చందు (22) 13వ తేదీ జాతరలోని అన్నదానంలో పాల్గొని రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో సంకల్ప హాస్పిటల్ వద్ద కొంత మంది గొడవ పడుతుండగా చూస్తూ నిలబడ్డాడు. ఈ క్రమంలో చందు ప్రత్యర్థి సురేష్ అనే వ్యక్తి చందును గమనించాడు. సురేష్ కత్తి ఇచ్చి చందుపై దాడి చేయమని చెప్పాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడవగా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.