
‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్
తిరుపతి రూరల్ : తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద సుమిత్ర టవర్స్‌లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ప్రత్యేకంగా రూపొందించిన నీట్ ష్యూర్ సక్సెస్ ప్రోగ్రామ్‌ను బుధవారం ప్రకటించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కరెస్పాండెంట్ శేషారెడ్డి తెలిపారు. ఈ పోస్టర్లను విడుదల చేశారు. అభ్యాసం, విద్యార్థులకు మెరుగైన గుణాత్మక శిక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 90 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు నీట్–2026లో 500మార్కులకు తక్కువ వస్తే 50శాతం ఫీజు రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. వివరాలకు అకాడమీ సెంటర్, లేదా 9133380222 నంబరులో సంప్రదించాలని సూచించారు.
తిరుమలలో సెక్యూరిటీ తనిఖీలు
తిరుమల : తిరుమలలో బుధవారం సాయంత్రం సెక్యూరిటీ ఆడిటింగ్ కమిటీ మెంబర్లు సునిత్ గరుడ, అరిఫ్ హాఫ్జ్ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అలిపిరి చెకింగ్ పాయింట్, నడక మార్గం, శ్రీవారి పాదాలు ఘాట్ రోడ్డు, హథీరాంజీ మఠం, శ్రీవారి ఆలయంలో బూందీ పోటు, మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, వైకుంఠం – 1, ఔటర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. గుర్తించిన అంశాలపై గురువారం సమీక్షించనున్నారు.
మహిళ ఆత్మహత్య
గూడూరురూరల్ : పట్టణ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. మనుబోలుకు చెందిన గునపాటి ఏడుకొండలు భార్య హేమలత (27) కొంతకాలంగా ఓజిలి మండలం కురుగొండ గ్రామానికి చెందిన రషీద్‌తో సహజీవనం చేస్తోంది.ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో హేమలత ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆప్పత్రికి తరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీర జవాన్లకు రూ.లక్ష విరాళం
తిరుపతి అర్బన్: వీర జవాన్లకు ముగ్గురు చిన్నారులు రూ.లక్ష విరాళం అందించారు. బుధవారం ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్‌కు తిరుపతి చెందిన అనిరుధ్, అశ్రీధ్, సుచిత్ర డీడీ అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఏర్పేడు(రేణిగుంట) : ఏర్పేడు మండలం మేర్లపాక దళతవాడ వద్ద బుధవారం వేకువజామున జరగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నల్లంబల్లి తాలూక, ఎర్రబైనహల్లి సమీపంలోని నెక్కుంది గ్రామానికి చెందిన కృష్ణన్ పెరుమాళ్, రామన్ మధు(46)నాటుకోళ్లను తీసుకుని బొలెరో వాహనంలో వస్తూ వెనుకనుంచి లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కృష్ణన్ పెరుమాళ్, రామన్ మరణించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ట్రెక్కింగ్‌పై విచారణకు ఆదేశం
భాకరాపేట : అభయారణ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా ట్రెక్కింగ్ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయనందుకు అటవీశాఖ జిల్లా అధికారి వివేక్ బుధవారం భాకరాపేట ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, తలకోన సెంట్రల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తలకోన సెక్షన్ ఫారెస్టు ఆఫీసర్‌కు మెమోలు జారీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు.

‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్

‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్

‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్

‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్