వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు సబ్ స్టేషన్ పరిధిలో సీనియర్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఏలుమలై ఆదివారం కరెంట్ షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. తొండంబట్టు వద్ద గ్రామ పంచాయతీకి నీటి సరఫరా కోసం త్రీ ఫేస్ మోటారుకు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు వెళ్లాడు. సరఫరా ఇచ్చిన కొద్దిసేపటికే లైన్ల మీద చెట్టు కొమ్మ పడడంతో ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజులు కాలిపోయాయి. అయితే చెట్టు కొమ్మ తొలగించేంత వరకు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు వీలు కాదని, మరో ఫ్యూజును తొలగించేందుకు కరెంటు స్తంభం ఎక్కిన ఆయనకు రిటర్న్ సప్‌లై కావడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. సహచర సిబ్బంది స్థానికుల సహకారంతో తిరుపతికి తరలించారని, ఏలుమలై ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు.