
మాట్లాడుతున్న భారతీ రెడ్డి
కొరుక్కుపేట: రోగుల భద్రత, సంరక్షణే లక్ష్యంగా సేవలందిస్తున్నట్లు విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఈఓ బి.భారతీ రెడ్డి అన్నారు. చైన్నె వడపళనిలోని విజయా ఆసుపత్రిలో పేషెంట్ సేఫ్టీ కోసం డోజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాంటాక్ట్ లెస్ వైటల్స్ మానిటరింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో భారతీ రెడ్డి మాట్లాడుతూ..రోగుల భద్రత, సంరక్షణ కోసం కాంటాక్ట్ లెస్ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ స్టిస్టమ్‌ను తీసుకొచ్చా మని తెలిపారు. దీని వల్ల రోగిపై పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. డోజీ సీఈఓ గౌరవ్ పాల్గొన్నారు.