చైన్నె – కోవై వందే భారత్‌కు పచ్చ జెండా | - | Sakshi
Sakshi News home page

చైన్నె – కోవై వందే భారత్‌కు పచ్చ జెండా

Mar 22 2023 1:22 AM | Updated on Mar 22 2023 1:22 AM

- - Sakshi

సాక్షి, చైన్నె : చైన్నె – కోయంబత్తూరు మధ్య వందే భారత్‌ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు రైల్వే యంత్రాంగం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్‌ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే చైన్నె – మైసూర్‌ మధ్య వందే భారత్‌ రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైన్నె – కోయంబత్తూరు మధ్య ఈ రైలు సేవలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. అలాగే త్వరలో తాంబరం – సెంగోట్టయ్‌ మధ్య కొత్తరైలు సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. తిరుత్తురై పూండి – అగస్తీయ పల్లి మధ్య కూడా రైలు సేవలు మొదలు కావాల్సి ఉంది.

వందేభారత్‌ రైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement