వెబ్‌ సిరీస్‌గా స్లీపర్‌ 13 నవల | - | Sakshi
Sakshi News home page

వెబ్‌ సిరీస్‌గా స్లీపర్‌ 13 నవల

Mar 19 2023 1:32 AM | Updated on Mar 19 2023 1:32 AM

రచయిత రాబ్‌ సింక్‌లైర్‌ - Sakshi

రచయిత రాబ్‌ సింక్‌లైర్‌

తమిళ సినిమా: ప్రఖ్యాత ప్రత్యేక రాబ్‌ ిసింక్‌లైర్‌ రాసిన స్లీపర్‌ 13 నవల వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కనుంది. దీన్ని నిర్మాణ హక్కీలను టర్నింగ్‌ పాయింట్‌ ప్రొడక్షనన్స్‌ సంస్థ అధినేతలు సాకేత్‌ చౌదరి, చేతన్‌ మొతివాలా, సంజీవ్‌ గుప్తా పొందారు. ఇందులో చేతన్‌ మొతివాలా ఇప్పటికే హిందీలో వెల్‌ కమ్‌ టూ సజ్జన్‌ పూర్తి, ఎనీబడి కెన్‌ డ్యాన్స్‌ చిత్రాలను నిర్మించారు. సంజీవ్‌ గుప్తా బెషరమ్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా స్లీపర్‌ 13 నవలను వెబ్‌ సిరీస్‌గా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను నిర్మించాలన్నదే తమ సంస్థ ధ్యేయమని నిర్మాతలు చెప్పారు. ప్రముఖ నవలా రచయిత రాబ్‌ సింక్‌లైర్‌ రాసిన ఈ నవల బహుళ ప్రాచూర్యం పొందిందని దాని హక్కులను పొంది వెబ్‌ సిరీస్‌గా రూపొందించడం సంతోషంగా ఉందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇది హై యాక్షన్‌ ప్యాక్డ్‌ వెబ్‌ సిరీస్‌గా ఉంటుందన్నారు. అంతర్జాతీయ విలువలతో రూపొందించనున్నట్లు చెప్పారు. మొదట ఆంగ్లంలో నిర్మించి ఆ తర్వాత భారతీయ భాషల్లో రూపొందిస్తామన్నారు. ఈ నవల రచయిత రాబ్‌ సింక్‌లైర్‌ మాట్లాడుతూ ఇండియన్‌ భాషల్లో తను నవలను వెబ్‌ సిరీస్‌గా రూపొందించడానికి హక్కులను ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తన నవల తెరపైకి రావడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement