కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ
సూర్యాపేటటౌన్ : తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఆమరణ దీక్ష చేయడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలో పదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్‌కు జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక, ఒంటెద్దు నరసింహారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, గుజ్జా యుగేందర్‌రావు, పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆకుల లవకుశ పాల్గొన్నారు.


