పల్లె ఓటర్లు 6,94,815
భానుపురి (సూర్యాపేట) : పల్లె ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 6,94,815 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది, ఇతరులు మరో 22 మంది ఉన్నారు. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది ఓటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. తిరుమలగిరి మినహా అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాతోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
జిల్లాలో 486 పంచాయతీలు
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫ్రిబవరిలో గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసింది. అయితే అక్టోబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ సమయంలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ మొదటివారంలోనే ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు నమోదయ్యారు. నోటిఫికేషన్ రాగానే తుది జాబితా ప్రకటిస్తే 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇదే జాబితాతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
అనంతగిరి 12545 13343 01 25,889
ఆత్మకూర్ 21800 22252 01 44,053
చిలుకూరు 15915 16984 00 32899
చింతలపాలెం 13132 13700 00 26832
చివ్వెంల 14328 14882 01 29211
గరిడేపల్లి 22654 24135 07 46796
హుజూర్‌నగర్ 10287 10744 00 21031
జాజిరెడ్డిగూడెం 12157 12458 00 24615
కోదాడ 15462 16418 01 31881
మద్దిరాల 12569 12738 00 25307
మఠంపల్లి 18314 19349 00 37663
మేళ్లచెరువు 16740 17546 01 34287
మోతె 18731 19087 05 37823
మునగాల 17695 18699 00 36394
నడిగూడెం 12089 12481 01 24571
నాగారం 12227 12545 03 24775
నేరేడుచర్ల 10720 11422 00 22142
నూతనకల్ 14503 14563 00 29066
పాలకీడు 10358 11110 00 21468
పెన్‌పహాడ్ 16632 17445 00 34077
సూర్యాపేట 15652 15967 01 31620
తిరుమలగిరి 8925 8874 00 17799
తుంగతుర్తి 17308 17308 00 34616
మొత్తం 3,40,743 3,54,050 22 6,94,815
తుది ఓటరు జాబితా విడుదల
అత్యధికంగా గరిడేపల్లి
మండలంలో 46,796 మంది
జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి


