ప్రీ ప్రైమరీ స్కూళ్లకు నిధులు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ విద్యను బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల కోసం బోధన సామగ్రి కొనుగోలు, తరగతి గదుల అలంకరణ, లెర్నింగ్ మెటీరియల్, మల్టీ మీడియా కిట్లు, శానిటేషన్ వంటి అవసరాల కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు ఆకర్షణీయమైన శ్రద్ధ పెంచేలా విద్యా వాతా వరణం అవసరమని భావించి ఈ నిధులను విడదల చేసింది. వీటితో చిన్నారులకు ఆట పాటలతో, చిత్రాలతో, రైమింగ్, లెర్నింగ్ కిట్లతో నేర్పే ప్లే–వే విధానం మరింత బలోపేతం కానుంది.
40 ప్రీప్రైమరీ పాఠశాలలు..
జిల్లాలో మొత్తం 30 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. వీటితో మరో పది పీఎంశ్రీ పాఠశాలలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు బోధన సామగ్రి, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాలకు రూ. 1.70 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి.
ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన..
ప్రీ ప్రైమరీలో చేరే పిల్లలు నాలుగేళ్లు నిండిన వారై ఉండాలి. అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలను ప్రీ ప్రైమరీకి పంపిస్తారు. ప్రీ ప్రైమరీ కోసం పాఠశాలలోనే ఒక గదిని కేటాయించి, గదిని ఆహ్లాదం పంచేలా అందంగా అలకరించడం, గోడలను అక్షరాలు, బొమ్మలతో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయాలపై సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే బోధన సిబ్బందిని ఎంపిక చేశారు.
ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఇవే..
ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ తొండ(తిరుమలగిరి మండలం), ఎంపీపీఎస్ అమరవరం(హుజూర్‌నగర్ మండలం), ఎంపీయూపీఎస్ భీక్యాతండా(కోదాడ), ఎంపీపీఎస్ పూలగడ్డపస్త్యాల(నాగారం), ఎంపీపీఎస్ పోలుమల్ల(మద్దిరాల), ఎంపీపీఎస్ గోండ్రియాల(అనంతగిరి), ఎంపీపీఎస్ సోమవరం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ బొత్తలపాలెం(పాలకవీడు), ఎంపీయూపీఎస్ బుర్కచర్ల(మోతె), ఎంపీపీఎస్ రత్నవరం(నడిగూడెం), ఎంపీయూపీఎస్ సర్వారం(మోతె), ఎంపీయూపీఎస్ రత్నపురం(సూర్యాపేట), పీఎస్ మున్యానాయక్‌తండా(చివ్వెంల), ఎంపీపీఎస్ అలాంగ్‌పురం(పాలకవీడు), ఎంపీపీఎస్ మానాపురం(తుంగతుర్తి), ఎంపీయూపీఎస్ బక్కమంతులగూడెం(మఠంపల్లి, ఎంపీపీఎస్ శాంతినగర్(నాగారం), ఎంపీపీఎస్ తాళ్లఖమ్మంపహాడ్(సూర్యాపేట), ఎంపీపీఎస్ ముకుందాపురం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ తోల్‌తండా(మోతె), ఎంపీపీఎస్ లాల్‌తండా, ఎంపీపీఎస్ కొత్తగూడెం, ఎంపీపీఎస్ సిరిపురం(నడిగూడెం), ఎంపీపీఎస్ నరసింహపురం(మునగాల), ఎంపీపీఎస్ కలకోవ, ఎంపీపీఎస్ త్రిపురవరం(అనంతగిరి), ఎంపీపీఎస్ చెనుపల్లి, ఎంపీపీఎస్ నర్లెంగులగూడెం(పాలకవీడు), ఎంపీపీఎస్ కచ్చవారిగూడెం(గరిడేపల్లి), ఎంపీపీఎస్ కర్విరాలకొత్తగూడెం(తుంగతుర్తి), ఎంపీపీఎస్ గాజులమొల్కాపురం(పెన్‌పహాడ్), మొర్సకుంటతండా, రంగయ్యగూడెం, చినగారకుంటతండా, ఎంపీపీఎస్ జేత్యతండా(తిరుమలగిరి), ఎంపీపీఎస్ వడ్డరివాడ(అనంతగిరి), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హుజుర్‌నగర్, ఎంపీపీఎస్ ఎన్‌ఎస్‌పీ క్యాంపు, ఎంపీపీఎస్ వెంపటి(తుంగతుర్తి మండలం) ప్రీప్రైమరీ కింద ఎంపికయ్యాయి.
ఫ ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షల
నిధులు మంజూరు
ఫ జిల్లాలో 40 ప్రీ ప్రైమరీ పాఠశాలలు
ఫ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా..
ఫ ఆహ్లాదకరమైన వాతావరణంలో
విద్యాబోధన


