నేటి నుంచి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
సూర్యాపేట : తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నారు. దీనికోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ కొనసాగుతుంది. ఈనెల 29,30 తేదీల్లో పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోగల అంతటి విజయ్ ఫంక్షన్ హాల్(వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 600 మంది కల్లుగీత కార్మికోద్యమ ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.వి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు.
తొలిరోజు బహిరంగ సభ
29, 30 తేదీల్లో ప్రతినిధుల సభ


