నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలి
● ఎన్నికల పరిశీలకుడు రవినాయక్
అర్వపల్లి: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు గుగులోతు రవినాయక్ ఆదేశించారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ పత్రాలు పరిశీలించి ఆర్‌ఓకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, డీఆర్‌డీఓ అప్పారావ్, డీపీఓ యాదగిరి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎంపీఓ గోపి, ఎస్‌ఐ సైదులు, పంచాయతీ కార్యదర్శులు నవీన్‌రెడ్డి, నెహ్రూనాయక్, ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.


