మణిహారంలా ఔటర్ రింగ్ రోడ్
హుజూర్‌నగర్: ఔటర్ రింగ్ రోడ్ హుజూర్‌నగర్ పట్టణానికి మణిహారంలా ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 6 కోట్లతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2013లో రూ. 22 కోట్లతో ఒక వైపు , ఇప్పుడు రూ. 6 కోట్లతో మరోవైపు రింగ్‌రోడ్డు నిర్మించామన్నారు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, డీఈ రమేష్, వివిధ శాఖల అధికారులు రమేష్, రామకిషోర్, సత్యనారాయణ పాల్గొన్నారు.
కోదాడ: విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని కలిగించడానికి పాఠశాలలు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం కోదాడపట్టణంలోని సీసీరెడ్డి విద్యానిలయంలో 19వ సీఎస్‌ఏ స్పోర్ట్స్‌మీట్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 30 ఏళ్లుగా కోదాడలో తాను సీసీరెడ్డి విద్యానిలయాన్ని పరిశీలిస్తున్నానని, ఇందులో అన్ని రకాల వసతులను కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా పాఠశాల వాతావరణం ఉండాలని అందుకు ప్రతి స్కూల్ నిర్వాహకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఫ నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మణిహారంలా ఔటర్ రింగ్ రోడ్


