విద్య ఒక ఆయుధం
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్
చివ్వెంల(సూర్యాపేట) : విద్య ఒక ఆయుధం అని దానిని సద్వినియోగం చేసుకుని గ్రామానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో డీఎల్‌ఎస్‌ఏ, సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీతో కలిసి విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించారు. జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని, భావిభారతపౌరులుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, చారిటబుల్ సోసైటీ అధ్యక్షుడు తల్లమళ్ల హస్సెన్, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు నాతి సవీందర్ కుమార్, జ్యోతి, కోక రంజిత్, సుంకర రవి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


