కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
ఫ నేడు సెమీఫైనల్స్, ఫైనల్స్
చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు ప్రతి జట్టు 9 జట్లతో పోటీపడ్డాయి. మంగళవారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. గెలుపొందిన జట్లకు కలెక్టర్ హనుమంతరావు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, టి. సురేందర్‌రెడ్డి తదితరులు పాల్డొన్నారు.


