చైనా మాంజా గొంతుకు తగిలి గాయాలు
భూదాన్‌పోచంపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడికి చైనా మాంజా తగలడంతో గొంతుకు గాయాలపాలయ్యాడు. చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ మదార్ వ్యక్తిగత పనిమీద సోమవారం బైక్‌పై పోచంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్‌హౌజ్ సమీపంలోకి రాగానే మెయిన్ రోడ్డుపై కరెంట్ తీగలపై నుంచి కిందికి వేలాడుతున్న చైనా మాంజా.. మదార్ గొంతుకు తగిలి కోసుకుపోయింది. వెంటనే అతను అప్రమత్తమై బైక్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పింది. గొంతు కోసుకుపోయి రక్తస్రావం అవుతుండగా స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.


