బీబీనగర్ ఎయిమ్స్ పనులు ఇంకెన్నాళ్లు..!
ప్రారంభంకాని అత్యవసర వైద్య సేవలు
సాక్షి,యాదాద్రి : అధునాతన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన బీబీనగర్ ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నిధుల కేటాయింపుల్లో జాప్యంతో మందకొడిగా పనులు నడుస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పనులు పూర్తిచేయాలని గడువు పొడిగించారు.
2023లో శంకుస్థాపన
తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2023 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్ యోజనలో భాగంగా దీనికి రూ.1365.95కోట్లు మంజూరు చేశారు. ఈపీసీ విధానం ద్వారా ఏసీసీ కంపెనీకి టెండర్ ద్వారా పనులను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 201.65 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్‌కు అప్పగించగా అందులో పనులు జరుగుతున్నాయి. 24 నెలల్లో అంటే 2024 జూనలై 13 నాటికి పనులన్నీ పూర్తిచేసి ఎయిమ్స్‌కు అప్పగించాలి. అయితే పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో 2025 నవంబర్ వరకు ఆస్పత్రి, సేవలకు చెందిన భవనాలు, ఇతర బ్లాక్‌లు సిద్ధం చేశారే కానీ పూర్తి పనులు కాలేదు. పనులు జాప్యం జరగడానికి కారణం నిధులు కేటాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని తెలు స్తోంది. పనులు జరుగుతున్న విధంగా నిధులు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.834.90 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో రూ.805.59 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.29.31 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. దీంతో పనుల గడువు పొడిగించారు. 2026 ఫిబ్రవరి నాటికి 390 బెడ్ల ఆస్పత్రి బ్లాక్‌లతో పాటు పూర్తిస్థాయి మెడికల్ పరికరాలతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాణాలు ఇలా..
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎయిమ్స్ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల వసతి కోసం 24 అంతస్తుల్లో రెండు టవర్స్ నిర్మించారు. 750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు. డాక్టర్లు, లెక్చర్ థియేటర్, ఎగ్జామ్ హాల్, రీసెర్చ్ ల్యాబ్, 22 ఫ్యాకల్టీల రీసెర్చ్ ల్యాబ్‌లు, నర్సింగ్, పారా మెడికల్ స్టాఫ్ వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్, న్యూ ఆస్పత్రి బ్లాక్, అకడమిక్ బ్లాక్, ఆడిటోరియం, ఆయుష్ బ్లాక్, రోగుల వెంట వచ్చేవారి కోసం నైట్ షెల్టర్, మార్చురీ, డైరెక్టర్ రెసిడెన్స్, గెస్ట్‌హౌజ్ అండ్ క్లబ్, ఆరు రకాల క్వార్టర్స్, యూజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ వర్కింగ్ నర్సుల హాస్టల్, డైన్నింగ్ బ్లాక్, కమ్యూనిటీ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, అమృత్ ధార, అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ప్యానల్ రూం, పార్కులతోపాటు పోస్టాఫీస్, బ్యాంకు ఇతర మౌలిక వసతులు తదితర పనులు చేపడుతున్నారు.
ఫ రూ.1,365.95కోట్లతో
నిర్మాణానికి శ్రీకారం
ఫ నిర్దేశించిన గడువులోగా
పూర్తికాని పనులు
ఫ 2026 ఫిబ్రవరి వరకు గడువు
పొడిగింపు
ఫ అందని అత్యవసర వైద్యసేవలు
రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించిన నిమ్స్ భవనాలలో ప్రస్తుతం 38 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఎయిమ్స్‌లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్ధోపెడిక్, న్యూరా లజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్‌టీ, అప్తామాలజీ, రేడియాలజీ, డెర్మటాలజీ, స్కిన్ సర్జరీలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, ఎంఆర్‌ఐ స్కాన్, లాప్రోస్కోపిక్, సీటీ స్కాన్, క్యాన్సర్ చికిత్సలు, ఆపరేషన్ ఽథియేటర్లు, పీడియాట్రిక్, డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు.


