ప్రతి విద్యార్థి ఆధార్ అప్‌డేట్ చేయాలి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని అన్ని పాశాలల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన మండల ఆపరేటర్లకు నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలానికి ఒక ఆపరేటర్‌ను ఎస్‌ఎన్‌ఆర్ ఏజెన్సీ ద్వారా నియమించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,532 విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆపరేటర్లకు పాఠశాలల వారీగా ఉన్న వివరాలను ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రవణ్ కుమార్, సూర్యనారాయణ, ఇ–డిస్ట్రిక్ట్ మేనేజర్ గఫార్ అహ్మద్, జిల్లా టెక్నికల్ పర్సన్ శ్రీధర్, ఆపరేటర్లు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు


