రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
సూర్యాపేట : స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండలో నిర్వహించిన క్రికెట్ సెలక్షన్స్‌లో జిల్లా కేంద్రానికి చెందిన ఎంఎస్‌కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 12 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో అండర్–14 విభాగంలో జిల్లేపల్లి కనిష్క్, యర్రంశెట్టి రిశాంక్, కౌశిక్, తరుణ్, అండర్–16 విభాగంలో ఆహిల్ పాల్, అఖిలేష్ యాదవ్, కుశ్లేశ్వర్, అండర్–19 విభాగంలో విష్ణు, శివ, ధనుష్ పుష్కర్ ఎంపికయ్యారు. అలాగే, అండర్–17 విభాగంలో పల్లవి ఎంపికై నట్టు అకాడమీ హెడ్ కోచ్ షేక్ ఉస్మద్ తెలిపారు.


