● చేప చిక్కింది.. ఆకలి తీరింది | - | Sakshi
Sakshi News home page

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

Nov 22 2025 7:48 AM | Updated on Nov 22 2025 7:48 AM

● చేప

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

ఉపాధి పథకం వివరాలు..

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

సాంకేతికతను

సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేటటౌన్‌ : అత్యాధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకొని కేసుల దర్యాప్తులో వేగంగా పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై త్వరగా స్పందించాలన్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్‌ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. పోక్సో కేసుల్లో, మహిళా సంబంధ కేసుల్లో వేగంగా దర్యాప్తు చేయాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులను అప్రమత్తం చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను, వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీ రవీందర్‌ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యాపేట శివారులోని చెరువులో కొంగ చేపల కోసం మాటేసింది.

చివరకు చేప చిక్కడంతో తన ఆకలి తీర్చుకుంది. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సూర్యాపేట

నాగారం : మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా కుటుంబ పోషణకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని తమ వంతుగా అందిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలి పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ పార, గడ్డపార పట్టి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు ఊరు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే వారు.. ఇప్పుడు ఉన్న ఊరిలోనే కూలి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ పని దినాలను వినియోగించుకొని శభాష్‌ అనుపించుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పనులకు వెళ్తున్న వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే అధికంగా ఉంది. ఒక్కో మహిళ సరాసరి నిత్యం రూ.260–280 వరకు ఆర్జిస్తోంది. కొందరు మహిళలు నెలలో 20 రోజుల పాటు పనులకు వెళ్తున్నారు. ఈ డబ్బులతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.

నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు..

జిల్లాలోని 486 పంచాయతీల్లో ఉపాధి పనుల్లో అతివలదే జోరు కనిపిస్తోంది. పని ప్రదేశాల్లో వీరే అధికంగా ఉంటున్నారు. హాజరు సమయానికి పనికిరావడం, పని పూర్తయిన తర్వాతే వెళ్లడం వంటి నిబంధనలు మహిళలే అధికంగా పాటిస్తున్నారు. టీఏలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం నిబంధన ప్రకారం ఒక ఏడాదిలో ఒక కుటుంబానికి వంద రోజులు మాత్రమే పనులు ఉంటాయి. వంద రోజుల పని పూర్తయిన తర్వాత మళ్లీ వచ్చే ఏడాది వార్షిక సంవత్సరం ప్రారంభం వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా జిల్లాలో సుమారు 56 కుటుంబాలు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి. వీరు మళ్లీ ఉపాధి పనులకు వెళ్లాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇలా క్రమం తప్పకుండా పనులకు వచ్చే మహిళలకు త్వరగా ఉపాధి పనిదినాలు అయిపోతున్నాయి. ఇలాంటి వారికి 150 రోజుల పనిదినాలు ఇవ్వాలనే డిమాండ్‌ గతం నుంచే ఉంది.

జాబ్‌ కార్డులు పరిశీలిస్తే..

ఉపాధి హామీ పథకం ప్రారంభించిన కొత్తలో పురుషులే కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత రోజుల్లో క్రమంగా మహిళలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో అతివలే ముందంజలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 2.63 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. వీటిలో 5.7లక్షల కూలీలు ఉన్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.33 లక్షల మంది కూలి పనులు చేశారు. ఇందులో మహిళలు 1.80 లక్షల మంది, పురుషులు 1.53 లక్షల మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పని దినాలు చేసి మేం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు.

ఉపాధి పనుల్లో ఆమెదే పైచేయి

జాబ్‌ కార్డులు : 2.63లక్షలు

మొత్తం కూలీలు : 3,33,433

పనులు వినియోగించుకున్న

మహిళలు : 1,80,235

పురుషులు : 1,53,198

పూర్తయిన పనిదినాలు: 29.58లక్షలు

మహిళలు చేసినవి : 18.10లక్షలు

పురుషుల పనిదినాలు : 11.48లక్షలు

ఫ ఎస్పీ నరసింహ

ఉపాధి పనులను జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 2025–26లో ఇప్పటి వరకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంఽధిత క్షేత్ర సహాయకులను సంప్రదించాలి.

– డి.శిరీష, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ

ఫ మహిళలు పలుగు పార పట్టి

ఉపాధి హామీ బాట

ఫ 2025–26లో ఇప్పటి వరకు

1.80 లక్షల మంది అతివలు హాజరు

ఫ పురుషుల కంటే 27వేల మంది అధికం

ఫ పనిదినాలు వినియోగించుకోవడంలోనూ ముందంజ

● చేప చిక్కింది.. ఆకలి తీరింది1
1/4

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

● చేప చిక్కింది.. ఆకలి తీరింది2
2/4

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

● చేప చిక్కింది.. ఆకలి తీరింది3
3/4

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

● చేప చిక్కింది.. ఆకలి తీరింది4
4/4

● చేప చిక్కింది.. ఆకలి తీరింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement