నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 22, 23వ తేదీల్లో వాలీబాల్ ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యూత్ బాలుర, అండర్ 17 బాలికల విభాగంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకుడు, వాలీబాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎడవల్లి ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం పోటీలు ప్రారంభమవుతాయని, 23న క్రీడల ముగింపు ఉంటుందని పేర్కొన్నారు.
డిజిటల్ యుగంలో
సరికొత్త సవాళ్లు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : డిజిటల్ యుగంలో మానవాళి మునిపెన్నడూ చూడని సరికొత్త సవాళ్లను చూస్తోందని, కొత్త ఆన్‌లైన్ వ్యసనాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెట్టుబడి మోసాలు, నకిలీ లింకులు నమ్మదగినట్లుగా కనిపించే గ్రూపులు ఆర్థికంగా, మానసికంగా ప్రజలను కుంగ తీస్తున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందంటూ అత్యాశ చూపే సైట్స్, లింక్‌లు పెరుగుతున్నాయని తెలిపారు. ఇవి గమనించకపోతే తీవ్రమైన నష్టం తప్పదని పేర్కొన్నారు.
శ్రీలక్ష్మీనారసింహుడి
నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా నిత్యకల్యాణం విశేషంగా జరిపించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జ్ ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆరోగ్య
పరీక్షలు నిర్వహించాలి
సూర్యాపేటటౌన్ : ప్రతి రోజు 120 మంది పిల్ల లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, స్క్రీనింగ్ చేసిన ప్రతి విద్యార్థినిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే టీమ్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయపాలన పాటించాలని, హాజరు కాని ప్రతి విద్యార్థిని కూడా గుర్తించి తప్పక స్క్రీనింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ కోటి రత్నం, సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆండాళ్ దేవికి
ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో జరిగే నిత్యారాధనల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా జరిపించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామున సుప్రభాతం, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్


