ఇంకా నర్సరీల్లోనే మొక్కలు
కోదాడరూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం అభాసు పాలవుతోంది. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరిట మొక్కలు పెంచుతోంది. అయితే గ్రామాల్లోని నర్సరీల్లో లక్షల్లో మొక్కలు పెంచుతున్నా వాటిని నాటడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లక్ష్యం 1.69లక్షలు
కోదాడ మండలంలోని 16 గ్రామాల్లో 1.69 మొక్కలను పెంచి నాటాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు. ఆ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచినా వాటిని నాటకుండా నర్సరీల్లోనే వదిలేశారు. 1.69 లక్షల మొక్కలకు ఒక్కో దానికి మట్టి నింపినందుకు రూ.0.90 పైసలు, విత్తనానికి రూ.0.30 పైసలు చెల్లించారు. ఆ తర్వాత మొక్కలను నాటేందుకు, గుంట తీసేందుకు ఉపాధి హామీ పనిలో భాగంగా ఒక్కో మొక్కకు రూ.100, వాటి సంరక్షణకు నీటి అందించేందుకు 400 మొక్కలకు 24 రోజులకుగాను రోజు రూ.300 లను కూలీలకు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటిరకు మండంలో 1.20లక్షల మొక్కలు నాటామని అధికారులు చెబుతున్నారు. అసలు గ్రామాల్లో సరిగ్గా మొక్కలే నాటనప్పుడు వాటి సంరక్షణ ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.
నాటిన మొక్కలపై నిరక్ష్యం
వనమహోత్సవం పేరుతో గ్రామాల్లో తూతూ మంత్రంగా నాటిన మొక్కల సంరక్షణను అధికారులు పూర్తిగా వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టకపోవడంతో ఆ మొక్కలు ఎండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల పశువులు మేస్తున్నాయి.
తొగర్రాయి నర్సరీలో దర్శనమిస్తున్న మొక్కలు
దోరకుంట నర్సరీలో ఉన్న మొక్కలు
నాటకుండా వదిలేసిన మొక్కలు
వానాకాలం ముగిసినా ముందుకు
సాగని వనమహోత్సవం
ఇంకా నర్సరీల్లోనే మొక్కలు


