సూర్యాపేట మార్కెట్‌కు 40,659 బస్తాల ధాన్యం రాక
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం ధాన్యం భారీగా వచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతుండడంతో రైతులు అమ్మకానికి దాదాపు 40,659 బస్తాలు (26,428 క్వింటాల) ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఇందులో అత్యధికంగా జైశ్రీరాం రకం 33,703 బస్తాలు వచ్చింది. బీపీటీ 3186 బస్తాలు, ఐఆర్ 64 2057 బస్తాలు, హెచ్‌ఎంటీలు 1637 బస్తాలు, బీపీటీ పాతవి 71 బస్తాలు, ఆర్‌ఎన్‌ఆర్‌లు 5 బస్తాల చొప్పున ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చారు. ఈ సీజన్‌లో గురువారం దాకా 20వేల బస్తాల ధాన్యమే రాగా.. శుక్రవారం ఒక్కసారిగా ధాన్యం రాక పెరిగింది. దీంతో షెడ్లు అన్నీ నిండిపోయి ధాన్యం రాశులతో కళకళలాడుతున్నాయి.


