ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన చరిత్ర సీపీఐది
అనంతగిరి: ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్సు జాతా శుక్రవారం అనంతగిరి మండలంలోని శాంతినగర్‌కు చేరుకుంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామంలో బైక్‌ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వచ్చేనెల 26న ఖమ్మంలో ని నిర్వహించే ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్‌కే అలీ, లతీఫ్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన, రవి, సహయ కార్యదర్శి లాలు, యువజన సంఘం అధ్యక్షుడు డేగ వీరయ్య, రైతు సంఘం నాయకులు వీరభద్రం, శాఖా కార్యదర్శి వీరబాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


