పోస్టాఫీస్‌కు నూతన భవనాన్ని నిర్మించాలి
కోదాడ : కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న పాత పోస్టాఫీస్ స్థలంలో తక్షణమే కొత్త భవనాన్ని నిర్మించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కొత్త భవనం నిర్మిస్తామని పాత భవనాన్ని కూల్చివేశారని, కానీ నేటి వరకు కొత్తది నిర్మించలేదన్నారు. ఎంతో విలువైన స్థలం ఆక్రమణకు గురవుతోందని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని బహుళ అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ నూతన భవన నిర్మాణ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో అధికారులను దశల వారీగా కలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి గంధం బంగారును నియమించారు. ఈ సమావేశంలో నాయకులు జాస్తి సుబ్బారావు, పొడుగు హుస్సేన్, కుదరవెళ్లి బసవయ్య, రావెళ్ల సీతారామయ్య, రాయపూడి చిన్ని, పి.సత్యబాబు, ఎస్‌కే.నయీం, ముత్తవరపు రామారావు, కనగాల జనార్ధన్‌రావు, మిట్టగడుపుల ముత్యాలు, బాబు, బొల్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


