ఆందోళనలో రైతులు
వరుస వర్షాలతో చేనుపైనే పత్తి తడవడంతో పాటు పత్తిని ఆరబెట్టుకునే పరిస్థితి లేని కారణంగా పత్తిలో 20 శాతం వరకు తేమ ఉండటంతో సీసీఐ అధికారులు కొనడం లేదు. దీంతో రైతులు పత్తి అమ్మకం కోసం మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు మిల్లులను బంద్ చేయడం వల్ల రైతులు పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో అర్థం గాక ఆందోళన చెందుతున్నారు. సీసీఐ అధికారులు పెట్టిన నిబంధనను తొలగించి పత్తిని వెంటనే కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. మరోవైపు మద్దతు ధరకు తమ పత్తి అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఒక్కసారిగా కొనుగోళ్లు నిలిచిపోయాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కిరాయి ట్రాక్టర్లలో పత్తిని తీసుకువచ్చిన రైతులు పత్తిని తీసుకొని తిరిగి వెనక్కు వెళ్లలేక, మరోమారు పత్తి ఎగుమతి చార్జీలు భరించలేక వెయిటింగ్ చార్జీలు మీదపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.


