చన్నీటిస్నానం.. పరుపులపై నిద్ర
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లోని ఎస్సీ హాస్టల్లో 50 మంది విద్యార్ధులకు గాను ప్రస్తుతం 33మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ హాస్టల్లో ఉన్న సోలార్ పవర్ ప్యానళ్లు పనిచేయడం లేదు. గీజర్ లేకపోవండతో విద్యార్దులు ఉదయం, సాయంత్రం వేళల్లో చన్నీళ్ల తోటే స్నానం చేస్తున్నారు. విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ చేసినప్పటికీ రగ్గులు, చలికోట్లు ఇవ్వకపోవడంతో చలికి వణకుతున్నారు. మంచాలు లేక నేలపైన పరులు వేసుకుని నిద్రిస్తున్నారు. అలాగే ఎస్టీ హాస్టల్లో 169 విద్యార్థులకు 132 మంది ఉన్నారు. చలికాలంలో పంపిణీ చేసే రగ్గులు, చలికోట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. ఈ హాస్టల్‌కు హీటర్లు సప్‌లై చేయకపోవడంతో విద్యార్ధులు చలిలోనే చన్నీటితో స్నానాలు చేస్తున్నారు.
చన్నీటిస్నానం.. పరుపులపై నిద్ర


