తిరుమలగిరి బీసీ హాస్టల్‌లో మంచాలు లేక..
రెండు రోజులుగా చలి బాగా పెడుతోంది. హాస్టల్‌లో మంచాలు లేకపోవడంతో బండలపైన పడుకుంటున్నాం. ఉదయం పూట చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నాము. మంచాలు, గీజర్లు ఏర్పాటు చేయాలి.
– గౌతమ్ కృష్ణ, విద్యార్థి, బీసీ హాస్టల్,
తిరుమలగిరి
తిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరిలోని బీసీ బాలురు, గిరిజన వసతి గృహాల్లో వేడి నీటితో స్నానం చేయడానికి గీజర్లు లేకపోవడంతో చలి నీళ్లతో స్నానం చేస్తున్నారు. బీసీ బాలుర హాస్టల్‌లో మంచాలు లేకపోవడంతో బండలపైనే పడుకుంటూ చలికి వణికిపోతున్నారు.
తిరుమలగిరి బీసీ హాస్టల్‌లో మంచాలు లేక..


