యాదాద్రిలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ, వేద మంత్రాలు పఠిస్తూ తీరొక్క పూలు, తులసీ దళాలతో ఆగమశాస్త్రం ప్రకారం లక్ష పుష్పార్చన చేశారు. వేకువజామున సుప్రభాత సేవ, స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణోత్సవం తదితర నిత్యారాధనలు, దైవదర్శనాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. కొంద కింద మండపంలో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.


