మందులు కొనడానికి పైసల్లేవ్
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తే గానీ కుటుంబం గడవదు. ఐదేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ నేటికీ మంజూరు కాలే. ఆరోగ్యం బాగాలేక రోజూ మందులు వేసుకోవాల్సి వస్తుంది. కూలికి వెళ్తే గాని మాత్రలు కొనలేని పరిస్థితి. పింఛన్ వస్తే కనీసం మందులకు ఆసరా అవుతాయని పలుమార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్న. కానీ ఇప్పటివరకు పింఛన్ మంజూరు చేయలే.
బొడ్డు లచ్చమ్మ, ఆత్మకూర్(ఎస్)
ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి మంజూరు చేస్తాం.
అప్పారావు, డీఆర్‌డీఓ, సూర్యాపేట


